
నవీన్‌చంద్ర, దివ్య పిైళ్లె జంటగా నటిస్తున్న సైకలాజికల్ హారర్ థ్రిల్లర్ హనీ. కరుణకుమార్ దర్శకుడు. రవి పీట్ల, ప్రవీణ్‌కుమార్‌రెడ్డి నిర్మాతలు. నిజజీవిత సంఘటనల ప్రేరణతో మూఢ నమ్మకాలు, అంధ విశ్వసాలు, డార్క్ సైకలాజికల్ ఎలిమెంట్స్‌తో ఈ సినిమా కథ సాగుతుందని, అన్ని వర్గాల ప్రేక్షకులకూ నచ్చే సినిమా అవుతుందని మేకర్స్ చెబుతున్నారు. దివి, రాజారవీంద్ర, బేబీ జయన్ని, బేబీ జయత్రి కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఫిబ్రవరి 6న ప్రపంచవ్యాప్తంగా సినిమా థ్రియేట్రికల్ రిలీజ్ కానున్నది. ఈచిత్రానికి రచన, దర్శకత్వం: కరుణ కుమార్, నిర్మాతలు: రవి పీట్ల, ప్రవీణ్ కుమార్ రెడ్డి, సంగీతం: అజయ్ అరసాడ, డీఓపీ : నగేష్ బన్నెల్, ఎడిటింగ్: మర్తాండ్ కె వెంకటేశ్.















