Skip to main content

Namaste NRI

మూఢనమ్మకాల కాన్సెప్ట్‌తో నవీన్ చంద్ర హనీ మూవీ.. రిలీజ్ ఎప్పుడంటే?

నవీన్‌చంద్ర, దివ్య పిైళ్లె జంటగా నటిస్తున్న సైకలాజికల్‌ హారర్‌ థ్రిల్లర్‌ హనీ. కరుణకుమార్‌ దర్శకుడు. రవి పీట్ల, ప్రవీణ్‌కుమార్‌రెడ్డి నిర్మాతలు. నిజజీవిత సంఘటనల ప్రేరణతో మూఢ నమ్మకాలు, అంధ విశ్వసాలు, డార్క్‌ సైకలాజికల్‌ ఎలిమెంట్స్‌తో ఈ సినిమా కథ సాగుతుందని, అన్ని వర్గాల ప్రేక్షకులకూ నచ్చే సినిమా అవుతుందని మేకర్స్‌ చెబుతున్నారు. దివి, రాజారవీంద్ర, బేబీ జయన్ని, బేబీ జయత్రి కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఫిబ్రవరి 6న ప్రపంచవ్యాప్తంగా సినిమా థ్రియేట్రికల్‌ రిలీజ్‌ కానున్నది. ఈచిత్రానికి రచన, దర్శకత్వం: కరుణ కుమార్‌, నిర్మాతలు: రవి పీట్ల, ప్రవీణ్‌ కుమార్‌ రెడ్డి, సంగీతం: అజయ్ అరసాడ, డీఓపీ : నగేష్‌ బన్నెల్‌, ఎడిటింగ్‌: మర్తాండ్‌ కె వెంకటేశ్‌.

Social Share Spread Message

Latest News