లేడి సూపర్ స్టార్ నయనతార నటించిన చిత్రం అన్నపూరణి. నీలేష్ కృష్ణ దర్శకత్వం. ఎస్. ఆర్.రవీంద్రన్ సమర్పణలో, నాస్ స్టూడియోస్ -ట్రైడెంట్ ఆర్ట్స్, జీ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మించాయి. ఇక మూవీలో జై, సత్యరాజ్, అచ్యుత్ కుమార్, కెఎస్ రవికుమార్, సురేష్ చక్రవర్తి సహా పలువురు నటీనటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమా డిసెంబర్ 01న ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. పాజిటివ్ టాక్తో ఈ మూవీ ప్రస్తుతం థియేటర్లలో స్క్రీనింగ్ అవుతుంది. అయితే ఈ సినిమా విడుదలై నెల రోజులు కూడా కాకముందే ఓటీటీ డేట్ లాక్ చేసుకుంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ నెట్ఫ్లిక్స్ వేదికగా డిసెంబర్ 29 నుంచి ఈ సినిమా తమిళం. తెలుగు, కన్నడ. మలయాళంతో పాటు హిందీ భాషల్లో స్ట్రీమింగ్ కానున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. ఈ చిత్రానికి సత్యన్ సూర్యన్ సినిమాటోగ్రఫీ అందిస్తుండగా.. థమన్ సంగీతం అందిస్తున్నారు.














