హిందువుల మనోభావాలను దెబ్బతీసే రీతిలో అన్నపురాణి చిత్రం ఉన్నట్లు ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. ఆ ఫిల్మ్‌లో ముఖ్య పాత్ర పోషించిన నయనతార పై కేసు కూడా నమోదు అయ్యింది. ఈ నేపథ్యం లో నటి నయనతార క్షమాపణ లేఖను రిలీజ్ చేసింది. ఎవరి మనోభావాలను దెబ్బతీయాలన్న ఉద్దేశం తనకు గానీ, తన చిత్ర బృందానికి లేదని ఆమె అన్నారు. అన్నపురాణి: ద గాడెస్ ఆఫ్ ఫుడ్ చిత్రం లోని కొన్ని దృశ్యాలు హిందువుల మనోభావాలను కించపరిచే విధంగా ఉన్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఆ మూవీలో శ్రీరాముడిని అవమానిస్తూ లవ్ జిహాద్‌ను ప్రోత్సహించే రీతిలో కొన్ని సీన్లు ఉన్నాయి. ఈ ఆరోపణలు రావడంతో నెట్‌ఫ్లిక్స్ నుంచి ఆ చిత్రాన్ని తొలగించేశారు.
పాజిటివ్ మెసేజ్ ఇవ్వాలన్న ఉద్దేశంతో తెలియకుండానే ఎవరినైనా బాధ పెట్టి ఉంటామని, గతంలో థియేటర్లలో ప్రదర్శించిన చిత్రాన్ని ఇప్పుడు ఓటీటీ ప్లాట్‌ఫామ్ నుంచి తొలగించడాన్ని తాము ఊహించ లేదని, ఎవరి మనోభావాలను కించపరచడం తన ఉద్దేశం కాదు అని, సమస్యలో ఉన్న గాఢతను తాము అర్థం చేసుకోగలమని ఆమె అన్నారు. తాను దేవుడిని విశ్వసిస్తానని, దేశంలోని ఆలయాలను తురుచూ విజిట్ చేస్తుంటానని, కావాలని చేయలేదని, ఎవరి మనసును బాధపెట్టినా, వారందరికీ హృదయపూర్వకంగా క్షమాపణలు చెబుతున్నట్లు ఆమె వెల్లడించారు.














