Namaste NRI

అన్నపూరణి స్ట్రీమింగ్‌ నిలిపివేసిన నెట్‌ఫ్లిక్స్‌

నయనతార తాజాగా నటించిన చిత్రం అన్నపూరణి. నీలేష్‌ కృష్ణ దర్శకత్వం. డిసెంబర్‌ 1న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద పెద్దగా ప్రభావం చూపకపోయినా ఓటీటీలో ఆదరణ పొందింది. నెట్‌ఫ్లిక్స్‌ వేదికగా స్ట్రీమింగ్‌ అవుతున్న ఈ చిత్రానికి సంబంధించి ఓ చేదువార్తను తాజాగా ఆ సంస్థ ప్రకటిం చింది. ఈ సినిమా స్ట్రీమింగ్‌ను నిలిపివేస్తున్నట్లు నెట్‌ఫ్లిక్స్‌ ప్రకటించింది. ఈ చిత్రం శ్రీరాముడిని కించపరి చేలా ఉందంటూ ముంబయి పోలీసులకు ఫిర్యాదు అందింది. శ్రీరాముడు మాంసాహారి అని, ఇది వాల్మీకి అయోధ్య కాండలో ఉంది అంటూ ఈ సినిమాలో ఓ డైలాగ్‌ ఉంటుంది. ఇటీవల ఈ సినిమా చూసిన మహా రాష్ట్రకు చెందిన శివసేన మాజీ నేత రమేశ్‌ సోలంకి మూవీలోని కొన్ని సన్నివేశాలపై అభ్యంతరం తెలుపుతూ ముంబయి పోలీసులకు ఫిర్యాదు చేశారు.

హీరో ముస్లిం అయి ఉండటం, హీరోయిన్‌ బ్రాహ్మణ కుటుంబానికి చెంది ఉండటంతో లవ్‌ జీహాద్‌ను ప్రోత్స హించేలా ఉందని, ఈ చిత్ర నిర్మాతలపై చర్యలు తీసుకోవాలని రమేశ్‌ సోలంకి ఫిర్యాదులో పేర్కొన్నారు.  ఈ సినిమాపై దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. పలు చోట్ల కేసులు కూడా నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో అన్నపూరణి సినిమా స్ట్రీమింగ్‌ను నిలిపివేస్తున్నట్లు నెట్‌ఫ్లిక్స్‌ ప్రకటించింది.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events