Namaste NRI

కొత్త కోడలొచ్చింది.. బాగా చూసుకోండి: విజయ్‌ దేవరకొండ

టాలీవుడ్‌ మోస్ట్ సెన్సేషనల్ కపుల్ విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నల వివాహ వేడుకలు అత్యంత వైభవంగా కొనసాగుతున్నాయి. ఈ కొత్త జంట తాజాగా తెలుగు మీడియా ప్రతినిధులను మర్యాదపూర్వకంగా కలుసుకుంది. ఈ సందర్భంగా విజయ్ దేవరకొండ తనదైన శైలిలో మాట్లాడుతూ తెలుగు రాష్ట్రాలకు కొత్త కోడలు వచ్చింది. తనను అందరూ మంచిగా చూసుకోవాలి అంటూ నవ్వులు పూయించాడు. తమ సినీ ప్రయాణంలో మీడియా ఒక అంతర్భాగమని, ఇప్పుడు జంటగా ప్రేక్షకుల ముందుకు రావడం ఒక విభిన్నమైన మరియు గొప్ప అనుభూతిని ఇస్తోందని ఆయన భావోద్వేగానికి లోనయ్యారు. కాలం మారుతున్నా, తాము ఎదుగుతున్నా తమను ఆదరించిన వారిని ఎప్పటికీ మర్చిపోమని, అందరి ఆశీస్సులు తమపై ఉండాలని విజయ్ కోరారు. రష్మిక సైతం తామిద్దరం కలిసి జీవితంలో ఒక మధురమైన కొత్త అధ్యాయాన్ని ప్రారంభించామని సంతోషం వ్యక్తం చేశారు.


Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events