అరుణ్ ఆదిత్య, అప్సరరాణి జంటగా నటిస్తున్న తాజా చిత్రం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. వినూత్న సెల్యూలాయిడ్స్ ఇండియా పతాకంపై నల్లా శ్రీదేవి నిర్మిస్తున్నారు. కృష్ణబాబు దర్శకుడు. ముహూర్తపు సన్నివేశానికి పరుచూరి గోపాలకృష్ణ క్లాప్‌నివ్వగా, సంగీత దర్శకురాలు యం.యం.శ్రీలేఖ కెమెరా స్విఛాన్ చేశారు. ఈ చిత్రం లో లక్ష్మీ, బేబి వినూత, ఉదయ్‌భాను తదితరులు నటిస్తున్నారు. ఏప్రిల్ 20 నుంచి పది రోజుల పాటు తొలి షెడ్యూల్ జరుపుతామని, రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా అందరిని అలరించే చిత్రమిదని దర్శకుడు కృష్ణబాబు తెలిపారు. తన కెరీర్‌లో వైవిధ్యమైన పాత్ర అవుతుందని కథానాయిక అప్సర రాణి చెప్పింది. ఈ చిత్రానికి కెమెరా: ఆర్.భాస్కర్, సంగీతం: యం.యం.శ్రీలేఖ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: కృష్ణబాబు.
