లైంగిక వేధింపుల ఆరోపణల్లో చిక్కుకున్న న్కూయార్క్ రాష్ట్ర గవర్నర్ ఆండ్రూ క్యుమో రాజీనామా చేశారు. 14 రోజుల్లో తన రాజీనామా అమల్లోకి వస్తుందని ఆండ్రూ చెప్పారు. ఆ తర్వాత లెఫ్టినెంట్ గవర్నర్ కేథీ హొచుల్ గరవ్నర్ పదవీ స్వీకరిస్తారు. న్యూయార్క్ చరిత్రలో ఆమె తొలి మహిళ గవర్నర్‌గా నిలవనున్నారు. డెమొక్రాటిక్ పార్టీకి చెందిన 63 ఏళ్ల ఆండ్రూ ప్రభుత్వ ఉద్యోగినులు సహా పలువురు మహిళలను లైంగికంగా వేధించినట్లు స్వతంత్ర దర్యాప్తు అధికారులు గతవారం ప్రకటించారు.