టీ20 ప్రపంచకప్‌లో భాగంగా జరిగిన దాయాదుల పోరులో టీమిండియా విజయం సాధించింది. న్యూయార్క్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్ లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా 19 ఓవర్లలో 119 పరుగులకే ఆలౌటైంది. రిషబ్ పంత్(42), అక్షర్ పటేల్(20)లు ఇద్దరు మాత్రమే రాణించారు. అనంతరం 120 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్తాన్ ను బుమ్రా దెబ్బ కొట్టాడు.

4 ఓవర్లు వేసిన బుమ్రా, కేవలం 14 పరుగులు మాత్రమే ఇచ్చి మూడు కీలక వికెట్లు తీశాడు. దీంతో 20 ఓవర్లు ఆడిన పాక్, 7 వికెట్లు కోల్పోయి 113 పరుగులే పరిమితమైంది. చివరి ఓవర్ వరకు కొనాసాగిన ఈ ఉత్కంఠ మ్యాచ్ లో భారత్ ఆరు పరుగులతో తేడాతో ఘన విజయం సాధించింది. గెలుపులో కీలక పాత్ర పోషించిన బుమ్రాకు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ లభించింది.
