వృత్తి, పర్యాటకం, విద్య సహా అన్ని రకాల క్యాటగిరీల వీసా ఫీజుల్ని న్యూజిలాండ్ భారీగా పెంచింది. ఈ నెల 1 నుంచే ఇవి అమల్లోకి వచ్చినట్టు ఆ దేశం ప్రకటించింది. దీంతో ఉద్యోగం, పర్యాటకం, ఉన్నత విద్య కోసం ఆ దేశానికి వెళ్లే భారతీయులపై ఇది తీవ్ర ప్రభావం చూపనున్నది. స్టూడెంట్ వీసా ఫీజును 188(రూ. 15,787) నుంచి 300 డాలర్ల (రూ.25వేలు)కు, టూరిస్ట్ వీసా ఫీజును 119 డాలర్ల (రూ.10వేలు) నుంచి 188 (రూ.15,787) డాలర్లకు పెంచుతూ న్యూజిలాండ్ నిర్ణయం తీసుకుంది.