
వర్ధన్ గుర్రాల, హమరేశ్, శాంతి తివారి, నిత్యశ్రీ ముఖ్య పాత్రల్లో నటిస్తున్న చిత్రం ట్రెండింగ్ లవ్. దొరకునా ఇటువంటి ప్రేమ ఉపశీర్షిక. హరీశ్ నాగరాజు దర్శకుడు. సోనూగుప్తా, రూపేశ్ డి గోయల్ నిర్మాతలు. మెగా డాటర్ కొణిదెల నిహారిక ఈ చిత్ర ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ దర్శకుడు హరీశ్‌తో గతంలో నేను ఓ షార్ట్‌ఫిల్మ్‌కు పనిచేశా. టాలెంటెడ్ డైరెక్టర్. ఈ సినిమాను ట్రెండీ లవ్‌స్టోరీగా తెరకెక్కించాడు. విజువల్స్ చాలా బాగున్నాయి అని చెప్పింది. నేటి యువతకు కనెక్ట్ అయ్యే ప్రేమకథా చిత్రమిదని, వినోదానికి పెద్దపీట వేశామని దర్శకుడు పేర్కొన్నారు. ఈ చిత్రానికి కెమెరా: బ్రహ్మతేజ మరిపూడి, సంగీతం: సునీల్‌కశ్యప్.
