భారత సంతతి మహిళ , దక్షిణ కరోలినా మాజీ గవర్నర్ నిక్కీ హేలీ ఫాదర్స్‌డే రోజునే తన తండ్రిని కోల్పోయారు. తన తండ్రి ప్రొఫెసర్ అజిత్‌సింగ్ రంధావా కన్నుమూసిన విషయాన్ని ఆమె స్వయంగా వెల్లడించారు. గతంలో ఆయనకు క్యాన్సర్ నిర్ధారణ అయింది. తండ్రికి ఫాదర్స్‌డే శుభాకాంక్షలు తెలిపిన ఆమె , తమ కుటుంబం ఎంతో కోల్పోతోందని పేర్కొన్నారు.
భారత్‌కు చెందిన అజిత్‌సింగ్ రంధావా ఎన్నో ఏళ్ల క్రితమే అమెరికాకు వలస వెళ్లారు. దక్షిణ కరోలినాలో వూరిస్ యూనివర్శిటీలో ప్రొఫెసర్‌గా పనిచేశారు. అమెరికా అధ్యక్షపదవికి రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిత్వానికి గత ఏడాది నిక్కి హేలీ పోటీ పడుతోన్న సమయం లోనే ఆయన క్యాన్సర్ బారిన పడినట్టు తెలిసింది. వాషింగ్టన్ డీసీ ప్రైమరీలో ట్రంప్‌పై నిక్కీ హేలీ నెగ్గి చరిత్ర సృష్టించారు.