
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రతీకార సుంకాలపై వెనక్కు తగ్గేది లేదని పునరుద్ఘాటించారు. చైనాతోసహా ఏ దేశానికి తన వాణిజ్య సుంకాల నుంచి మినహాయింపు ఇచ్చే ప్రసక్తి లేదని ఆయన స్పష్టం చేశారు. కొన్ని టెక్ ఉత్పత్తులపై తన ప్రభుత్వం సుంకాల మినహాయింపులు ఇచ్చినట్టు వస్తున్న వార్తలను ట్రంప్ తోసిపుచ్చారు. అమెరికాను అత్యంత హీనంగా చూస్తూ అన్యాయమైన వాణిజ్య విధానాలకు పాల్పడుతున్న దేశాలు ప్రత్యేకంగా చైనాను తమ చిట్టా నుంచి తప్పించే ప్రసక్తి లేదని ఆయన ప్రకటించారు.
