అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రటిక్ పార్టీ తరపున తానే అభ్యర్థినని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ స్పష్టం చేశారు. అధ్యక్ష ఎన్నికల్లో నేనే పార్టీ తరపున పోటీ చేస్తున్నాను. ఎన్నికల బరిలో నుంచి తప్పుకోమంటూ నాపై ఎలాంటి ఒత్తడి లేదు అని ఆయన పేర్కొన్నారు. ఈ క్రమంలో మీడియాతో మాట్లాడిన ఆయన ఆ ఊహాగానా లకు తెరదించారు. నేనేమీ ఎన్నికలను వదిలి పోవడం లేదు. నన్నెవరూ బయటకు పంపడం లేదు. మేమే ఈ ఎన్నికల్లో విజయం సాధించబోతున్నాం అంటూ ధీమా వ్యక్తం చేశారు.
ఇటీవల ట్రంప్‌తో జరిగిన డిబేట్‌లో బైడెన్ తడబడ్డారని, ట్రంప్ వాదనకు దీటుగా సమాధానం ఇవ్వలేకపోయా రని, దాంతో ఆయన ఎన్నికల బరిలో నుంచి తప్పుకుంటారంటూ మీడియా, పార్టీ వర్గాల్లో విస్తృతంగా చర్చ జరిగింది.