హమాస్‌పై యుద్ధంపై తగ్గేదే లేదంటూ ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ తెగేసి చెప్పా రు. దక్షిణ గాజానగరం రఫా సహా అన్ని చోట్ల హమాస్ బ్రిగేడ్లను పూర్తిగా తుడిచిపెట్టే వరకు తమనెవరూ ఆపలేరని స్పష్టం చేశారు. రఫాపై దాడులు చేస్తే ఏకాకిగా మిగిలే ప్రమాదముందని అమెరికా హెచ్చరికలు జారీ చేసిన క్రమంలో నెతన్యాహు మాట్లాడుతూ ఏ శక్తీ మమ్మల్ని ఆపలేదు. ఎన్నో శక్తు లు మా చర్యలను అడ్డుకోవడానికి ప్రయత్నించాయి. కానీ ప్రయోజనం లేదు. మా శత్రువు ఇటీవల చేసింది భవిష్యత్‌లో మళ్లీ చేయకుండా గట్టి గా బుద్ధి చెబుతాం అని ఆయన పేర్కొన్నారు.