Namaste NRI

ఇండియా నుంచి ఎటువంటి ప్ర‌క‌ట‌న రాలేదు : రష్యా

ఏ దేశం నుంచి అయినా భార‌త్ స్వేచ్ఛ‌గా ఇంధ‌నాన్ని కొనుగోలు చేయ‌వ‌చ్చు అని రష్యా పేర్కొన్న‌ది. చ‌మురు, ఇంధ‌నం స‌ర‌ఫ‌రా అంశంలో త‌మ విధానంలో ఎటువంటి మార్పు ఉండ‌ద‌ని క్రెమ్లిన్ వెల్ల‌డించింది. భార‌త్‌కు కేవ‌లం ర‌ష్యా మాత్ర‌మే ఇంధ‌నాన్ని స‌ర‌ఫ‌రా చేయ‌డం లేద‌ని, ఇత‌ర దేశాల నుంచి కూడా చ‌మురును భార‌త్ కొనుగోలు చేస్తోంద‌ని, దీంట్లో కొత్త‌గా మేం ఏం చేసేది లేద‌ని ర‌ష్యా ప్ర‌తినిధి దిమిత్ర పీస్కోవ్ తెలిపారు. ర‌ష్యా నుంచి ఇంధ‌నం కొనుగోలును ఆపేందుకు ప్ర‌ధాని మోదీ అంగీక‌రించార‌ని, ర‌ష్యాకు బ‌దులుగా ఇక నుంచి వెనిజులా నుంచి భార‌త్ ఆయిల్‌ను కొంటుంద‌ని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ పేర్కొన్న విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో ర‌ష్యా ప్ర‌తినిధి పెస్కోవ్ స్పందిస్తూ త‌మ నుంచి ఇంధ‌నం కొనుగోలు ఆపేస్తున్న‌ట్లు ఇండియా నుంచి ఎటువంటి ప్ర‌క‌ట‌న రాలేద‌న్నారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events