Skip to main content

Namaste NRI

ఇంత కంటెంట్ ఉంటుందని ఊహించలేదు : ఉస్తాద్ భగత్ సింగ్ సక్సెస్ మీట్ లో హరీశ్ శంకర్

పవన్‌కల్యాణ్‌ కథానాయకుడిగా రూపొందిన చిత్రం ఉస్తాద్‌ భగత్‌సింగ్‌. శ్రీలీల, రాశీఖన్నా కథానాయికలు. హరీశ్‌శంకర్‌ దర్శకత్వం. మైత్రీమూవీమేకర్స్‌ పతాకంపై నవీన్‌ యర్నేని, రవిశంకర్‌ యలమంచిలి నిర్మించిన ఈ చిత్రం గురువారం విడుదలైంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో నిర్వహించిన ఈ సినిమా సక్సెస్‌ ప్రెస్‌మీట్‌లో హరీశ్‌శంకర్‌ మాట్లాడారు. మొదటి షో నుంచే అన్ని ప్రాంతాల నుంచి పాజిటివ్‌ టాక్‌ రావడం ఆనందంగా ఉంది. ఈ సినిమాలో ఇంత కంటెంట్‌ ఉంటుందని తాము ఊహించలేదంటూ చూసినవారిలో చాలామంది ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు. కమర్షియల్‌ ఎంటర్‌టైనర్‌ని తీస్తున్నాననీ, వింటేజ్‌ పవర్‌స్టార్‌ని చూపించబోతున్నానని ముందునుంచీ చెబుతూ వచ్చాను. చెప్పింది చేసి చూపించాననే ఆత్మసంతృప్తితో ప్రస్తుతం నా హృదయం నిండిపోయింది. ఇప్పటివరకూ చూపించని కొన్ని అంశాలను ఈ మాస్‌ ఎంటైర్టెనర్‌లో చూపించాం. ఇందులోని ప్రతి పాత్రా ఆడియన్‌కి కనెక్టయింది. సాంకేతికంగా అందరూ ప్రాణం పెట్టారు. తొలిప్రేమ పాట సెకండాఫ్‌లో పెట్టడం ఆడియన్స్‌ని బాగా నచ్చింది. ఇది మా టీమ్‌ సమిష్టి విజయం అంటూ ఆనందం వ్యక్తం చేశారు.

ఆట ఆటకీ వసూళ్లు పెరుగుతున్నాయని, ఇది పవర్‌స్టార్‌ వన్‌ మ్యాన్‌ షో అనీ, కచ్చితంగా భారీ వసూళ్లు ఖాయమని నిర్మాతలు నమ్మకం వెలిబుచ్చారు. ఇంకా కళాదర్శకుడు ఆనంద్‌సాయి, గీత రచయిత చంద్రబోస్‌ తదితరులు మాట్లాడారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events