Namaste NRI

భద్రాచలంలో ఈ నెల 19 నుంచి ఏప్రిల్ 2వ తేదీ వర శ్రీరామ నవమి తిరుకళ్యాణ బ్రహ్మోత్సవాలు

భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహించే శ్రీరామ నవమి తిరుకళ్యాణ బ్రహ్మోత్సవాల్లో పాల్గొనాల్సిందిగా ఆహ్వాన పత్రికను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మంత్రి కొండా సురేఖ ఇతర ప్రజాప్రతినిధులు మరియు అధికారులతో కలిసి అందజేశారు. ఈ నెల 19 నుంచి ఏప్రిల్ 2వ తేదీ వరకు శ్రీరామ నవమి తిరుకళ్యాణ బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి.

ఈ నెల 27 న భద్రాచల శ్రీ సీతారామచంద్ర స్వామి వారి తిరుకళ్యాణ మహోత్సవంలో పాల్గొనాల్సిందిగా దేవాదాయ శాఖ ప్రతినిధులు, ఆలయ అర్చకులు ముఖ్యమంత్రి గారిని కలిసి ఆహ్వానం అందించారు. ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క , మంత్రులు కొండా సురేఖ, తుమ్మల నాగేశ్వర రావు, పొంగులేటి శ్రీనివాస రెడ్డి, రాజ్యసభ సభ్యుడు వేం నరేందర్ రెడ్డితో పాటు ఇతర ప్రజాప్రతినిధులు, దేవాదాయ శాఖ డైరెక్టర్ హనుమంతరావు, ఆలయ ఈవో దామోదర్ రావు ఉన్నారు.

Social Share Spread Message

Latest News