
చిమటా రమేశ్‌బాబు స్వీయ దర్శకత్వంలో హీరోగా నటించిన చిత్రం నేను-కీర్తన. రిషిత, మేఘన హీరోయిన్లు. చిమటా జ్యోతిర్మయి సమర్పణలో చిమటా లక్ష్మీకుమారి నిర్మించారు. ఈ సందర్భంగా దర్శకుడు, కథానాయ కుడు చిమటా రమేశ్‌బాబు, కథానాయిక రిషిత మీడియాతో ముచ్చటించారు. ఇది దర్శకుడిగా, కథానాయకు డిగా తనకు మంచి పేరు తెచ్చే సినిమా అవుతుందని, ఇందులో కథానాయికగా నటించిన రిషితకు ఉజ్వల మైన భవిష్యత్తు ఉందని, రెండున్నర గంటలపాటు నాన్‌స్టాప్‌గా ఎంటర్‌టైన్ చేసే సినిమా ఇదని చిమటా రమేశ్‌బాబు తెలిపారు. నేను-కీర్తన సినిమా హీరోయిన్‌గా తన కెరీర్‌కి శుభారంభం ఇస్తుందనే నమ్మకంతో ఉన్నానని కథానాయిక రిషిత చెప్పారు. ఈ చిత్రం ఈ నెల 30న విడుదల కానుంది.
