అతను మిగతా వారాల్లో చాలా సైలెంట్‌గా ఉంటాడు. ఒక్క శనివారం మాత్రం వయొ లెంట్‌గా మారిపోతాడు. తన శత్రువులను అదే రోజున టార్గెట్ చేస్తుంటాడు. అలాంటి వ్యక్తి కథేమిటో తెలుసుకోవాలంటే సరిపోదా శనివారం చూడాల్సిందే అంటోంది చిత్రబృందం. నాని కథానాయకుడిగా వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని డివీవీ దానయ్య, కల్యాణ్ దాసరి నిర్మిస్తున్నారు. ఆగస్ట్ 29న ప్రేక్షకుల ముందుకురానుంది.
గురువారం నాని సెకండ్ లుక్‌ను విడుదల చేశారు. డిఫరెంట్ కాన్సెప్ట్‌తో తెరకెక్కిస్తున్న యాక్షన్ థ్రిల్లర్ చిత్రమిదని, నాని పాత్ర గత చిత్రాలకు పూర్తి భిన్నంగా ఉంటుందని, పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేయబోతున్నామని నిర్మాతలు తెలిపారు. ప్రియాంక అరుళ్ మోహన్, ఎస్‌జేసూర్య, సాయికుమార్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: మురళి జి, సంగీతం: జేక్స్ బిజోయ్, రచన-దర్శకత్వం: వివేక్ ఆత్రేయ.