అమెరికాలోని న్యూజెర్సీలో భారత సంతతికి చెందిన ఓ యువకుడు జరిపిన కాల్పుల్లో భారత యువతి ప్రాణాలు కోల్పోగా, మరో యువతి తీవ్రంగా గాయపడ్డారు. వీరంతా పంజాబ్‌కు చెందినవారు. నిందితుడు గౌరవ్ గిల్ (19) వాషింగ్టన్‌లోని కెంట్‌లో ఉంటున్నాడు. జస్వీర్ కౌర్ (29), గగన్‌దీప్ కౌర్ (20) ఒకే ఇంట్లో ఉంటున్నా రు. గౌరవ్, గగన్‌దీప్ పంజాబ్‌లోని నకోదర్‌లో ఐఈఎల్‌టీఎస్ కోచింగ్ సెంటర్‌లో కలిసి చదివారు. జస్వీర్ కార్టెరెట్‌లోని అమెజాన్ ఫెసిలిటీలో, ఆమె భర్త ట్రక్ డ్రైవర్‌గా పని చేస్తున్నారు. బుధవారం జస్వీర్ నిద్రపోతు న్న సమయంలో నిందితుడు గౌరవ్ వారి ఇంటి వద్దకు వచ్చాడు. గగన్‌దీప్‌తో గొడవపడ్డాడు. ఆమె జస్వీర్‌ను పిలిచింది. గౌరవ్‌కు జస్వీర్ సర్దిచెప్పబోయారు. వెంటనే గౌరవ్ కాల్పులు జరిపాడు. దీంతో జస్వీర్, గగన్‌దీప్ తీవ్రంగా గాయపడ్డారు. జస్వీర్ దవాఖానలో చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచారు. గగన్‌దీప్ పరిస్థితి విషమంగా ఉంది.
గిల్ తండ్రి చరణ్ మస్కట్‌లో ఉంటున్నారు. ఈ సంఘటన తెలిసిన తరువాత గిల్ తల్లి రెండు రోజులు ఆస్పత్రి పాలయ్యారు. నిందితుడు గౌరవ్ గిల్‌పై హత్య, చట్టవిరుద్ధంగా ఆయుధాన్ని కలిగి ఉన్నాడనే ఆరోపణలపై కేసులు నమోదు చేశారు. అయితే ఈ కాల్పుల వెనుక కారణం ఏమిటన్నది తెలియాల్సి ఉంది.