Namaste NRI

ఓ..! సుకుమారి నుంచి దామినిగా ఐశ్వర్య రాజేష్ ఫస్ట్ లుక్ విడుదల

తిరువీర్‌, ఐశ్వర్య రాజేష్‌ జంటగా నటిస్తున్న విలేజ్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ ఓ సుకుమారీ. భరత్‌ దర్శన్‌ దర్శకుడు. మహేశ్వరరెడ్డి మూలి నిర్మాత. ప్రస్తుతం సినిమా నిర్మాణ దశలో ఉన్నది. కథానాయిక ఐశ్వర్య రాజేష్‌ పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమాలో ఆమె పోషిస్తున్న దామిని పాత్రకు చెందిన ఫస్ట్‌లుక్‌ని మేకర్స్‌ విడుదల చేశారు. లంగావోణీ ధరించిన పల్లెటూరి అమ్మాయిగా ఈ స్టిల్‌లో ఐశ్వర్య రాజేష్‌ దర్శనమిచ్చారు. కర్రలు పట్టుకొని వెంబడిస్తున్న గ్రామస్థుల నుంచి తప్పించుకొని పారిపోతున్న ఐశ్వర్య రాజేష్‌ను ఈ ఫస్ట్‌లుక్‌లో చూడొచ్చు. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో విడుదల కానున్న ఈ చిత్రానికి కెమెరా: సీహెచ్‌ కుషేందర్‌, సంగీతం: భరత్‌ మంచిరాజు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events