Namaste NRI

ఓ..! సుకుమారిలో యాదగిరిగా తిరువీర్.. ఆకట్టుకున్న ఫస్ట్ లుక్

తిరువీర్‌, ఐశ్వర్య రాజేష్‌ జంటగా నటిస్తున్న చిత్రం ఓ సుకుమారీ. భరత్‌ దర్శన్‌ దర్శకుడు. మహేశ్వరరెడ్డి మూలి నిర్మాత. ప్రస్తుతం ఈ సినిమా నిర్మాణ దశలో ఉన్నది. ప్రమోషన్‌లో భాగంగా ఇప్పటికే విడుదల చేసిన ఈ సినిమాలోని ఐశ్వర్య రాజేష్‌ ఫస్ట్‌లుక్‌కి మంచి స్పందన వచ్చిందని మేకర్స్‌ చెబుతున్నారు.ఈ క్రమంలో తిరువీర్‌ ఫస్ట్‌లుక్‌ని రిలీజ్‌ చేశారు.

రగ్గ్‌డ్‌, మాసీ లుక్‌లో వీధిలో నడుచుకుంటూ వస్తున్న తిరువీర్‌ని ఈ స్టిల్‌లో చూడొచ్చు. స్లీవ్‌ లెస్‌ బనియన్‌, లుంగీ, భుజాలపై వేసుకున్న తువ్వాలు, కర్లీ హెయిర్‌, గడ్డం, నోట్లో టూత్‌బ్రెష్‌ మొత్తంగా పక్కా రూరల్‌ గెటప్పులో ఆయన ఈ పోస్టర్‌లో కనిపిస్తున్నారు. ఇందులో ఆయన యాదగిరి అనే పల్లెటూరి కుర్రాడిగా నటిస్తున్నారు. తెలుగుతోపాటు తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో విడుదల కానుంది. ఈ చిత్రానికి కెమెరా: సీహెచ్‌ కుషేందర్‌, సంగీతం: భరత్‌ మంచిరాజు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events