తరుణ్‌భాస్కర్, ఈషా రెబ్బా జంటగా నటిస్తున్న తాజా చిత్రం ఓం శాంతి శాంతి శాంతిః. ఏఆర్ సజీవ్ దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. చిత్రీకరణ పూర్తయింది. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. టీజర్‌ను లాంచ్ చేశారు. గ్రామీణ నేపథ్యంలో సహజమైన హాస్యం, డ్రామా కలబోతగా టీజర్ ఆకట్టుకుంది. ఇందులో చేపల వ్యాపారి అంబటి ఓంకార్ నాయుడు పాత్రలో తరుణ్‌భాస్కర్ కనిపించారు.గోదావరి జిల్లాల నేపథ్యంలో నడిచే హాస్యభరిత చిత్రమిదని, చక్కటి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా మెప్పిస్తుందని దర్శకుడు తెలిపారు.

తరుణ్ భాస్కర్ మాట్లాడుతూ ఇది నాకు చాలా పాషనేట్ ప్రాజెక్టు. సినిమా మనకి మరో జీవితం జీవించే అవకాశాన్ని ఇస్తుంది. నాకు అలాంటి అవలాశం ఇచ్చిన నిర్మాత సృజన్, డైరెక్టర్ సజీవ్ కి టీమ్ అందరికీ థాంక్యూ. గోదారి యాస, కల్చర్ కి ఒక సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ ఇచ్చిన సినిమా రీసెంట్ టైంలో ఓం శాంతి అవుతుంది. అది గ్యారెంటీగా చెప్తున్నాను. ఓం శాంతి లో కూడా మీకు నిజాయితీ కనిపిస్తుంది. ఈ క్యారెక్టర్ చేయాలనే ప్యాషన్ తో చేశాను. తాను ఎంతో ఇష్టపడి చేసిన సినిమా ఇదని పేర్కొన్నారు. ఈ సినిమాతో ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్ ఖాయమని దర్శకుడు సజీవ్ తెలిపారు. బ్రహ్మానందం, బ్రహ్మాజీ, సురభి ప్రభావతి తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: జై క్రిష్, నిర్మాతలు: సృజన్ యరబోలు, వివేక్ కృష్ణని, అనుప్ చంద్రశేఖరన్, సాధిక్ షేక్, నవీన్ సనివరపు.
















