నిరంజన్, గ్రీష్మ, నేత్రికా, ప్రియాంక, దీప్తి శ్రీరంగం ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం రుక్మిణి. సింహాచలం గుడుపూరి దర్శకుడు. నేలబల్లి సుబ్రహ్మణ్య రెడ్డి, కట్టా గంగాధర రావు నిర్మాతలు. సీనియర్ నటుడు రాజేంద్రప్రసాద్ చేతులమీదుగా ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను లాంచ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గంగాధర్ నాతో ఎన్నో ఏళ్లు పనిచేశాడు. ఎదురింటి మొగుడు పక్కింటి పెళ్లాం వంటి ఎన్నో హిట్ మూవీస్‌కు మాతో వర్క్ చేశాడు. నాకు మంచి స్నేహితుడైన ఆయన నిర్మాతగా ఈ సినిమా చేయడం హ్యాపీగా ఉంది అని అన్నారు.

హారర్ కామెడీ జోనర్‌లో విభిన్న కథాంశంతో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నామని, ఆద్యంతం సస్పెన్స్ ప్రధానంగా ఆకట్టుకుంటుందని దర్శకుడు తెలిపారు. హర్రర్ కామెడీ జోనర్‌లో సకుటుంబంగా ప్రేక్షకులంతా కలిసి చూసేలా ఈ సినిమా ఉంటుంది. సంక్రాంతికి టీజర్‌తో మీ ముందుకు వస్తాం అని హీరో నిరంజన్ చెప్పారు. ఈ చిత్రానికి కెమెరా: తరుణ్ రావుల, సంగీతం: సుభాష్ ఆనంద్, రచన-దర్శకత్వం: సింహాచలం గుడుపూరి.















