Skip to main content

Namaste NRI

న్యూ ఇయర్ సందర్భంగా రాజేంద్రప్రసాద్ చేతుల రుక్మిణి ఫస్ట్ లుక్ పోస్టర్ లాంఛ్

నిరంజన్‌, గ్రీష్మ, నేత్రికా, ప్రియాంక, దీప్తి శ్రీరంగం ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం రుక్మిణి. సింహాచలం గుడుపూరి దర్శకుడు. నేలబల్లి సుబ్రహ్మణ్య రెడ్డి, కట్టా గంగాధర రావు నిర్మాతలు. సీనియర్‌ నటుడు రాజేంద్రప్రసాద్‌ చేతులమీదుగా ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ను లాంచ్‌ చేశారు.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గంగాధర్‌ నాతో ఎన్నో ఏళ్లు పనిచేశాడు. ఎదురింటి మొగుడు పక్కింటి పెళ్లాం వంటి ఎన్నో హిట్‌ మూవీస్‌కు మాతో వర్క్‌ చేశాడు. నాకు మంచి స్నేహితుడైన ఆయన నిర్మాతగా ఈ సినిమా చేయడం హ్యాపీగా ఉంది అని అన్నారు.

హారర్‌ కామెడీ జోనర్‌లో విభిన్న కథాంశంతో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నామని, ఆద్యంతం సస్పెన్స్‌ ప్రధానంగా ఆకట్టుకుంటుందని దర్శకుడు తెలిపారు. హర్రర్‌ కామెడీ జోనర్‌లో సకుటుంబంగా ప్రేక్షకులంతా కలిసి చూసేలా ఈ సినిమా ఉంటుంది. సంక్రాంతికి టీజర్‌తో మీ ముందుకు వస్తాం అని హీరో నిరంజన్‌ చెప్పారు. ఈ చిత్రానికి కెమెరా: తరుణ్‌ రావుల, సంగీతం: సుభాష్‌ ఆనంద్‌, రచన-దర్శకత్వం: సింహాచలం గుడుపూరి.

Social Share Spread Message

Latest News