
మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం అనిల్ రావిపూడితో కలిసి మన శంకరవరప్రసాద్ గారు అనే సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుగుతోంది. వీరి సెట్‌కి సమీపంలో విజయ్ సేతుపతి, పూరి జగన్నాథ్ కలిసి చేస్తున్న మూవీ షూటింగ్ జరుగుతోంది. ఇందులో టబు కీలక పాత్రలో నటిస్తున్నారు. పూరి సేతుపతి టీమ్ చిరుని కలుసుకుని ఆశీస్సులు తీసుకుంది. ఇందులో నటులు చిరంజీవితో పాటు విజయ్ సేతుపతి, టబు, నయనతార, ఛార్మీ తదితరులు ఉన్నారు.
















