నష్టాల ఊభిలో ఉన్న పాక్‌ను గట్టెక్కించేందుకు ఆ దేశ ప్రధాని షహబాజ్ షరీష్ కీలక నిర్ణయం తీసుకున్నా రు. పాకిస్థాన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌లైన్స్‌తో సహా అన్ని ప్రభుత్వ సంస్థలను ప్రైవేటీకరించనున్నట్లు ప్రకటించారు. కొత్త లాంగ్-టర్మ్ ఎక్స్‌టెండెడ్ ఫండ్ ఫెసిలిటీ కోసం అంతర్జాతీయ ద్రవ్య నిధి తో పాకిస్తాన్ చర్చలు ప్రారంభించిన అనంతరం, వ్యూహాత్మక సంస్థలు మినహా మిగతా ప్రభుత్వరంగ సంస్థలన్నింటినీ ప్రైవేటీకరించనున్నట్లు వెల్లడించారు. నష్టాల్లో ఉన్న ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ ప్రక్రియపై సమీక్ష సమావేశానికి అధ్యక్షత వహించిన సందర్భంగా షరీఫ్ ఈ విషయాన్ని ప్రకటించారు.
సమావేశంలో వ్యూహాత్మకంగా యాజమాన్యంలోని కంపెనీలను మినహాయించి, అన్ని ఇతర సంస్థలను ప్రైవేటీకరించనున్నట్లు చెప్పారు. ప్రభుత్వ పని వ్యాపారం చేయడం కాదని, వ్యాపారం, పెట్టుబడులకు అనుకూలమైన వాతావరణాన్ని కల్పించడం షహబాజ్ షరీశ్ స్పష్టం చేశారు. ప్రైవేటీకరణ ప్రక్రియను పారదర్శకంగా చేయాల్సిన అవసరాన్ని నెక్కి చెప్పారు. బిడ్డింగ్, ఇతర ముఖ్యమైన దశల్లో సహా పాకిస్తాన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌లైన్స్ ప్రైవేటీకరణ ప్రక్రియను టెలికాస్ట్ చేయాలని ఆదేశించారు.