
అనుపమ పరమేశ్వరన్ నటిస్తున్న కాన్సెప్ట్ ఓరియెంటెడ్ మూవీ పరదా. దర్శన రాజేంద్రన్, సంగీత కీలక పాత్రధారులు. ప్రవీణ్ కాండ్రేగుల దర్శకుడు. విజయ్ డొంకాడ, శ్రీనివాసులు పి.వి, శ్రీధర్ మక్కువ నిర్మాతలు. ప్రస్తుతం ఈ చిత్రం నిర్మాణ దశలో ఉంది. ప్రమోషన్‌లో భాగంగా ఈ సినిమాలోని పాటను మేకర్స్ విడుదల చేశారు. ఆ మిలమిలమిల మెరుపల్లే.. సిరులొలికిన మన పల్లె, చిరునగవుల సొగసరివల్లే అంటూ సాగే ఈ గీతాన్ని వనమాలి రాయగా, గోపీసుందర్ స్వరపరిచారు. శ్రీకృష్ణ, రమ్య బెహరా ఆలపించారు. తెలుగు సాంప్రదాయం ఉట్టిపడేలా ప్లెజెంట్గా ఈ పాట విజువల్స్ ఉన్నాయి. అనుపమ పరమేశ్వరన్ డాన్స్ ఈ పాటకు ప్రత్యేక ఆకర్షణ. ఈ చిత్రానికి కెమెరా: మృదుల్ సుజిత్సేన్, నిర్మాణం: ఆనంద మీడియా.
