హమాస్, ఇజ్రాయెల్ కాల్పుల విరమణ ఒప్పందం అమలు చూస్తుంటే సహనం నశిస్తోందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు. బందీలను హోలోకాస్ట్ బాధితులతో పోల్చారు.హమాస్ విడుదల చేస్తున్న ఇజ్రాయెలీ బందీలను చూస్తుంటే మనసు చలించిపోతుందని అన్నారు. బందీలు నెలలతరబడి ఆహారం లేకుండా గడ్డు పరిస్థితులను ఎదుర్కొన్నట్లు కనిపిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇవన్నీ చూస్తూ తాము ఎంతకాలం సహనంతో ఉంటామో తెలియట్లేదని పేర్కొన్నారు.
![](https://namastenri.net/wp-content/uploads/2025/02/donaldtrump-5-300x160.jpg)