తెలంగాణ నేపథ్యంలో రూపొందుతున్న సెటైరికల్ కామెడీ ఎంటర్‌టైనర్ పైలం పిలగా. ఆనంద్ గుర్రం దర్శకత్వం. రామకృష్ణ బొద్దుల, ఎస్‌కే శ్రీనివాస్ నిర్మాతలు. సాయితేజ కల్వకోట, పావని కరణం జంటగా నటించారు. ఈ సినిమాలోని సోడు సోడు నొక్కమే నీ సోకు అనే పాటను డైరెక్టర్ శేఖర్ కమ్ముల గారు రిలీజ్ చేశారు. దర్శకుడు చిత్ర విశేషాలు తెలియజేస్తూ వ్యవసాయం చేస్తే కడుపు నిండుతుంది కానీ కోట్లు సంపాదించలేమని బలంగా నమ్మే ఓ యువకుడు సొంత ఊరిలోనే పెద్ద బిజినెస్‌ను ప్రారంభిస్తాడు. ఈ క్రమంలో అతనికి ప్రభుత్వ అధికారుల నుంచి ఎలాంటి సమస్యలు ఎదురయ్యాయన్నదే ఈ చిత్ర కథ. ఆద్యంతం వినోదాత్మకంగా అలరిస్తుంది అన్నారు. ఈ చిత్రానికి యశ్వంత్ నాగ్ సంగీతాన్నందించాడు.