భారత మాజీ ప్రధాని, భారతరత్న పీవీ నరసింహారావు దూరపు బంధువు ఉదయ్ నాగరాజు, బ్రిటన్ ఎంపీ ఎన్నికల్లో నిలబడ్డారు. కరీంనగర్ జిల్లా కోహెడ మండలంలోని శనిగరం గ్రామానికి చెందిన నాగరాజు, ఆయన కుటుంబ సభ్యులు కొన్నేండ్ల క్రితం బ్రిటన్‌లో స్థిరపడ్డారు. ఆయన లేబర్ పార్టీ తరఫున ఉత్తర బెడ్‌ఫోర్డ్‌షైర్ స్థానం నుంచి పోటీ చేస్తున్నారు. 45 ఏండ్ల ఉదయ్ నాగరాజ్ తన గెలుపుపట్ల విశ్వాసం వ్యక్తం చేశారు.