Namaste NRI

అరుంధతీ రాయ్‌కు పెన్‌ పింటర్‌ పురస్కారం

ఈ యేటి పెన్ పింట‌ర్ ప్రైజ్ అవార్డును అరుంధ‌తీ రాయ్  గెలుచుకున్న‌ది. నోబెల్ గ్ర‌హీత, ర‌చ‌యిత హ‌రాల్డ్ పింట‌ర్ జ్ఞాప‌కార్థం పెన్ పింట‌ర్ అవార్డును ఏర్పాటు చేశారు. రెచ్చగొట్టే ప్ర‌సంగాలు చేసిన ఘ‌ట‌న‌లో రెండు వారాల క్రిత‌మే అరుంధ‌తీ రాయ్‌పై యూఏపీఏ కింద కేసు న‌మోదు చేసిన విష‌యం తెలిసిందే. బ్రిటీష్ లైబ్ర‌రీ ఆధ్వ‌ర్యంలో ఈ బ‌హుమ‌తిని అంద‌జేయ‌నున్నారు. అక్టోబ‌ర్ 10వ తేదీన అవార్డు సెర్మ‌నీ ఉంటుంది. ఆ కార్య‌క్ర‌మంలో అరుంధ‌తీ రాయ్ మాట్లాడ‌నున్నారు.

బ్రిట‌న్‌, ఐర్లాండ్ లేదా కామ‌న్‌వెల్త్ దేశాల్లో ఉంటూ సాహితంలో అద్భుత ప్ర‌తిభ‌ను ప్ర‌ద‌ర్శించే వారికి పెన్ పింట‌ర్ ప్రైజ్ అంద‌జేస్తారు. ఇంగ్లీష్ పెన్ చైర్మెన్ రూథ్ బోర్త్‌విక్‌, న‌టుడు ఖ‌లిద్ అబ్ద‌ల్లా, రైట‌ర్ రోజ‌ర్ రాబిన్‌స‌న్‌ల‌తో కూడిన జ్యూరీ అరుంధ‌తీ రాయ్‌ని అవార్డు కోసం ఎంపిక చేసింది.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events