అమెరికా పర్యటనలో ఉన్న ప్రధాని నరేంద్ర మోదీ న్యూయార్క్‌లో ఉక్రెయిన్ అధ్యక్షుడు వోల్డోమిర్ జెలెన్‌స్కీని కలిశారు. ఆ ఇద్దరూ ద్వైపాక్షిక చర్చల్లో పాల్గొన్నారు. తాజాగా న్యూయార్క్‌లో జరిగిన సమ్మిట్ ఆఫ్ ద ఫ్యూచర్ మీటింగ్‌లో కలిశారు. ఇటీవల జరిగిన భేటీ గురించి ఇద్దరూ మాట్లాడుకున్నారు. ద్వైపాక్షిక సంబంధాలపై సంతోషం వ్యక్తం చేసుకున్నారు. ఉక్రెయిన్‌లో ప్రస్తుతం ఉన్న పరిస్థితుల గురించి కూడా చర్చించుకున్నారు. దౌత్యం, చర్చల ద్వారా శాంతియుత పరిష్కారాన్ని ఆశిస్తున్నట్లు మరోసారి ఉక్రెయిన్ వివాదంపై ప్రధాని మోదీ తెలిపారు. సంక్షోభాన్ని పరిష్కరించేందుకు భారత్ సహాయం చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు మోదీ చెప్పారు.
నెలల రోజుల వ్యవధిలోనే ఆ ఇద్దరూ రెండో సారి భేటీ అయ్యారు. ఆగస్టు 23వ తేదీన ఉక్రెయిన్‌లో మోదీ పర్యటించిన విషయం తెలిసిందే. రష్యాతో జరుగుతున్న యుద్ధాన్ని నిలిపివేసేందుకు తగిన చర్యలు తీసుకోనున్నట్లు ఆ సమయంలో మోదీ హామీ ఇచ్చారు. గడిచిన మూడు నెలల్లో మోదీ, జెలెన్‌స్కీ కలుసుకోవడం ఇది మూడవ సారి.