మోహన్ భగత్, సుప్రీత సత్యనారాయణ్, భూషణ్ కల్యాణ్, రవీంద్ర విజయ్ కీలక పాత్రధారులుగా రూపొందిన ఎమోషనల్ థ్రిల్లర్ ఆరంభం. అజయ్ నాగ్ వి. దర్శకుడు. అభిషేక్ వీటీ నిర్మాత. ఇటీవలే విడుదలైన ఈ సినిమా సక్సెస్‌మీట్ హైదరాబాద్‌లో జరిగింది. సినిమా అద్భుతమైన ప్రేక్షకాదరణ పొందుతున్నదని చిత్రయూనిట్ సంతోషం వెలిబుచ్చింది.
ప్రతి షో 60, 70 శాతం ఫుల్ ఫిల్ అవుతున్నాయని, ఈ ప్రేరణతో మరిన్ని మంచి సినిమాలు తీసే స్పూర్తిని మా సంస్థకు అందించిన ప్రేక్షకులకు ధన్యవాదాలని నిర్మాత తెలిపారు. ఇంకా హీరో మోహన్‌భగత్, దర్శకుడు అజయ్‌నాగ్, ఎగ్జిక్యూటీవ్ ప్రొడ్యూసర్ వినయ్‌రెడ్డి మామిడి, సంగీత దర్శకుడు సింజిత్ యెర్రమిల్లి, నటుడు భూషణ్ కల్యాణ్ కూడా మాట్లాడారు.