Namaste NRI

విశాఖపట్నంలో జరిగిన ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ (IFR) 2026లో పాల్గొన్న భారత రాష్ట్రపతి

విశాఖపట్నం సాగర తీరంలో ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ-2026 కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తో కలిసి గవర్నర్ అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ , కేంద్ర ఏవియేషన్ మినిస్టర్ రామ్మోహన్ నాయుడు పాల్గొన్నారు.

INS సుమేధా నౌకపై ప్రయాణిస్తూ రాష్ట్రపతి భారత నౌకాదళం మరియు మిత్ర దేశాల నౌకాదళాలకు చెందిన 72 ఆధునిక యుద్ధ నౌకలు, సబ్‌మరైన్లను సమీక్షించారు. ఈ సందర్భంగా గవర్నర్ అబ్దుల్ నజీర్, సీఎం చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ , నౌకాదళ అధిపతి అడ్మిరల్ దినేశ్ కె త్రిపాఠి తదితరులు పాల్గొన్నారు.

“United Through Oceans” అనే థీమ్‌తో జరిగిన IFR 2026 భారత్ సముద్ర శక్తి పెరుగుదలను, ప్రపంచ దేశాలతో బలపడుతున్న భాగస్వామ్యాలను ప్రతిబింబించింది. ఈ సందర్భంగా స్వదేశీ విమాన వాహక నౌక INS విక్రాంత్ పాల్గొనడం గర్వకారణం, ఇది ఆపరేషన్ సిందూర్‌లో కీలక పాత్ర పోషించి రక్షణ రంగంలో ఆత్మనిర్భర్ భారత్‌కు ప్రతీకగా నిలిచింది.

అంతర్జాతీయ నావికాదళాల భాగస్వామ్యం ఇండో-పసిఫిక్ అంతటా సముద్ర భద్రత, సహకారం మరియు శాంతి పట్ల సమిష్టి సంకల్పాన్ని ప్రదర్శించింది. భారత నౌకాదళం గ్లోబల్ స్థాయిలో ఎదుగుతున్న శక్తికి ఇది గొప్ప నిదర్శనం.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events