భారత ప్రధాని నరేంద్ర మోదీ స్కాట్లాండ్‌లో ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్‌స్కీ భేటీ అయ్యారు. స్కాట్లాండ్ రాజధాని గ్లాస్గో నగరంలో వీరి భేటీ జరిగింది. ఈ భేటీలో ఇరుదేశాలకు సంబంధించిన ద్వైపాక్షిక అంశాలపై వారు చర్చించారు. రక్షణ, వాణిజ్య, ఆర్థిక అంశాల్లో రెండు దేశాల మధ్య సంబంధాలు మరింత బలోపేతం చేసుకోవాలని ఈ సమావేశంలో నిర్ణయించారు. గ్లాస్గోలో కాప్ `26 సదసు జరుగుతున్నది. ఈ సందర్భంగా ప్రధాని మోదీ ఇతర దేశాల అధినేతలతో భేటీ అయి ద్వైపాక్షిక అంశాలపై మాట్లాడారు. పర్యావరణ పరిరక్షణ కోసం నిర్వహిస్తున్న ఈ సదస్సుకు వివిధ దేశాల అధినేతలు హాజరయ్యారు.
![](https://namastenri.net/wp-content/uploads/2025/02/40ae94df-5916-473f-9c15-eadaf1b15c93-179x300.jpg)