Skip to main content

Namaste NRI

ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ తో ప్రధాని మోదీ భేటీ

భారత ప్రధాని నరేంద్ర మోదీ స్కాట్లాండ్‌లో ఉక్రెయిన్‌ అధ్యక్షుడు వ్లాదిమిర్‌ జెలెన్‌స్కీ భేటీ అయ్యారు. స్కాట్లాండ్‌ రాజధాని గ్లాస్గో నగరంలో వీరి భేటీ జరిగింది. ఈ భేటీలో ఇరుదేశాలకు సంబంధించిన ద్వైపాక్షిక అంశాలపై వారు చర్చించారు. రక్షణ, వాణిజ్య, ఆర్థిక అంశాల్లో రెండు దేశాల మధ్య సంబంధాలు మరింత బలోపేతం చేసుకోవాలని ఈ సమావేశంలో నిర్ణయించారు. గ్లాస్గోలో కాప్‌ `26 సదసు జరుగుతున్నది. ఈ సందర్భంగా ప్రధాని మోదీ ఇతర దేశాల అధినేతలతో భేటీ అయి ద్వైపాక్షిక అంశాలపై మాట్లాడారు. పర్యావరణ పరిరక్షణ కోసం నిర్వహిస్తున్న ఈ సదస్సుకు వివిధ దేశాల అధినేతలు హాజరయ్యారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events