Namaste NRI

రష్యా అధ్యక్షుడు పుతిన్‌కు స్వాగతం పలికిన ప్రధాని మోదీ

భారత పర్యటన కోసం రష్యా అధ్యక్షుడు వ్లాదిమిన్‌ పుతిన్‌ ఢిల్లీకి చేరుకున్నారు. పాలం ఎయిర్‌పోర్ట్‌కు పుతిన్‌ విమానం చేరుకుంది. ఈ సందర్భంగా ఆయనకు ప్రధాని నరేంద్ర మోదీ ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా పుతిన్‌, మోదీ ఆత్మీయ ఆళింగనం చేసుకున్నారు. విమానాశ్రయంలో కళాకారుల నృత్యాలతో సంప్రదాయ స్వాగతం పలికారు. పుతిన్‌, ప్రధాని మోదీ ఇద్దరు ద్వైపాక్షిక అంశాలపై చర్చించనున్నారు.

పుతిన్‌కు గౌరవార్థం గురువారం రాత్రి ప్రధాని విందు ఇవ్వనున్నారు. రేపు ఉదయం 11 గంటలకు రాష్ట్రపతి భవన్‌లో అధికారిక స్వాగతం పలుకున్నారు. 23వ భారత్‌-రష్యా వార్షిక శిఖరాగ్ర సమావేశంలో పుతిన్‌ పాల్గొంటారు. ఈ సందర్భంగా అణువిద్యుత్‌ సహా పలు రంగాల్లో రెండుదేశాల మధ్య కీలక ఒప్పందాలు జరుగనున్నాయి. అంతకు ముందు కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి జేపీ నడ్డా, రష్యా ఆరోగ్యమంత్రి మిఖాయిల్‌ మురాష్కోతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆరోగ్య రంగానికి సంబంధించిన అంశాలపై చర్చించారు. ఆరోగ్యరంగంలో ద్వైపాక్షిక సహకారం, భాగస్వామ్యాన్ని పెంపొందించుకునేందుకు అంగీకరించారు.

Social Share Spread Message

Latest News