భారత ప్రధాని నరేంద్ర మోదీ ఉక్రెయిన్ పర్యటనపై అగ్రరాజ్యం అమెరికా స్పందించింది. ఈ పర్యటనతో శాంతి కోసం ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ చేస్తున్న ప్రయత్నాలకు అనుగుణంగా ఫలితం రావాలని ఆకాంక్షించింది. ఇది ఎంతో ముఖ్యమైనదని, ప్రపంచ దేశాలు మోదీ పర్యటనపై ఆసక్తి కనబరుస్తున్నాయని పేర్కొన్నది. ఈ పర్యటన ద్వారా రష్యా, ఉక్రెయిన్ సంఘర్షణకు ముగింపు పలికినట్లయితే, అది బాగా ఉపయోకరంగా ఉంటుందని భావిస్తున్నామని అమెరికా భద్రతామండలి అధికార ప్రతినిధి జాన్ కిర్బీ చెప్పారు.