Namaste NRI

అతిపెద్ద హిందూ దేవాలయం ప్రారంభించనున్న ప్రధాని

యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌(యూఏఈ) రాజధాని అబుదాబిలో అతిపెద్ద హిందూ దేవాలయం ప్రారంభానికి సిద్ధమైంది. సుమారు 27 ఎకరాల్లో ఏడు గాలి గోపురాలతో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన బీఏపీఎస్‌ ఆలయాన్ని ఈ నెల 14న భారత ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించనున్నారు. అరబ్‌ దేశాల్లోనే ఈ దేవాల యమంత పెద్దది మరోటి లేదు. అంతేకాదు మిడిల్‌ ఈస్ట్‌లోనే ఇది అతిపెద్ద దేవాలయంగా గుర్తింపు తెచ్చుకు న్నది. దేవాలయ అధిపతి బ్రహ్మవిహారీదాస్‌ స్వామి ఆధ్వర్యంలో ప్రాణ ప్రతిష్ఠ జరుపుకుంటున్న ఈ అతిపెద్ద హిందూ దేవాలయం 18 నుంచి భక్తులకు అందుబాటులోకి రానున్నది. ఫిబ్రవరి 15న స్వామి మహారాజ్‌ సమక్షంలో ప్రజా సమర్పణ సభ జరుగనున్నది. ఈ కార్యక్రమంలో పాల్గొనాలనుకునే భక్తులు ముందుగా ఫెస్టివల్‌ ఆఫ్‌ హార్మోనీ వెబ్‌సైట్‌కి వెళ్లి రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలి.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events