
హీరో ప్రిన్స్, సుహానా ముద్వాన్ జంటగా ఓ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ రూపొందుతున్నది. సునైనా, నెల్లూరు సుదర్శన్ కీలక పాత్రధారులు. కుమార్ రవికంటి దర్శకుడు. కమార్ రవికంటి నిర్మాత. రీసెంట్‌గా ప్రముఖుల సమక్షంలో ఈ సినిమా పూజా కార్యక్రమాలు జరిగాయి. మహూర్తపు సన్నివేశానికి బేబీ దియ క్లాప్ కొట్టగా, సుమ రవికంటి కెమెరా స్విచాన్ చేశారు. థ్రిల్లింగ్ అంశాలతోపాటు హృదయాలను హత్తుకునే భావోద్వేగాలు కూడా ఈ కథలో ఉంటాయని, జూలై, ఆగస్ట్ నెలల్లో ఏకధాటిగా చిత్రీకరణ జరుపుతామని, విదేశాల్లో పాటలను చిత్రీకరిస్తామని నిర్మాత తెలిపారు. ఈ చిత్రానికి మాటలు: భవాని ప్రసాద్, కెమెరా: జి.అమర్, నిర్మాణం: లైట్ స్టోర్మ్ సెల్యులాయిడ్స్.
