ప్రపంచవ్యాప్తంగా కోట్ల సంఖ్యలో అభిమానులను సంపాదించుకున్న ప్రసిద్ధ జపనీస్ పజిల్ సుడోకు సృష్టికర్త మాకి కాజీ క్యాన్సర్ తో టోక్యోలో కన్నుమూశారు. ఆయన స్థాపించిన నికోలి కంపెనీ వెల్లడిరచింది. 2004 నుంచి ఇది బాగా ప్రాచుర్యంలోకి వచ్చింది. జపనీయులు సుడోకును స్థానికంగా సుజి` వా`డోకుషిన్`ని`కగిరి అని పిలుస్తారు. దాన్ని షార్ట్ కట్‌లో సుడోకుగా వాడుకలోకి వచ్చింది. మాకి కాజీ దాదాపు 30 దేశాల్లో సుడోకు పజిల్స్ గురించి చెబుతూ పర్యటించారు. సుడోకు చాంపియన్‌షిప్‌ల ద్వారా దాదాపు 100 దేశాల్లో 20 కోట్ల మందికి చేరువయ్యామని నికోలి కంపెనీ తెలిపింది. ఆక్స్‌ఫర్డ్ డిక్షనరీలోకి ఆ పదం ప్రవేశించడం విశేషం. 1 నుంచి 9 వరకు అంకెలతో పజిల్‌ను నిపండం ఆ పిజల్ ప్రత్యేకత. నికోలి కంపెనీ ద్వారా పజిల్‌ను మార్కెటింగ్ చేసేవారు. దేశదేశాల్లోని పత్రికలు ఈ పజిల్‌ను ప్రచురిస్తున్నాయి. తన పజిల్‌ను ప్రాచుర్యంలోకి తెచ్చేందుకు కాజీ 30కి పైగా దేశాల్లో పర్యటించారు.