యుద్ధం కారణంగా అమాయక ప్రజలు చనిపోవడం ఆగాలని పుతిన్ కోరుకుంటున్నారని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. తాను ఇటీవల రష్యా అధ్యక్షుడితో సంభాషించిన ఫోన్కాల్ వివరాలను ట్రంప్ తాజాగా వెల్లడించారు. ప్రజలు చనిపోవడం ఆపాలని ఆయన అనుకొంటున్నారు. మరణించిన వారంతా యువత, మంచివాళ్లు. వారు మీ పిల్లల్లాంటి వారే. అకారణంగా లక్షల మంది చనిపోయారు అని ట్రంప్ వ్యాఖ్యానించారు. అలాగే, ఒక వేళ తాను 2022 సమయంలోనే అధ్యక్షుడిగా ఉండి ఉంటే, ఈ యుద్ధం ఎప్పటికీ జరిగేది కాదన్నారు. అలాగే, తనకు రష్యా అధినేతతో ఉన్న బలమైన సంబంధాన్ని ఆయన గుర్తు చేశారు. నాకు పుతిన్తో సత్సంబంధాలున్నాయి. దేశానికే బైడెన్ ఓ అవమానం అని వ్యాఖ్యానించారు.
![](https://namastenri.net/wp-content/uploads/2025/02/donaldtrump-5-300x160.jpg)