ఉక్రెయిన్ ప్రతిపాదించిన షరతులు లేని 30రోజుల కాల్పుల విరమణ ఒప్పందాన్ని అంగీకరించకపోతే మాస్కోపై ఒత్తిడి పెంచుతామని నాలుగు ప్రధాన యూరోపియన్ దేశాలు రష్యాపై ఒత్తిడి తెచ్చిన వేళ నేరుగా చర్చిద్దామని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీకి రష్యా అధ్యక్షుడు పుతిన్ ప్రతిపాదించారు. పుతిన్ ప్రతిపాదనను శాంతియుతమైన పరిష్కారం కోసం నిబద్ధతతో చేస్తున్న ప్రయత్నంగా రష్యా ప్రభుత్వ అధికార ప్రతినిధి పెస్కోవ్ అభివర్ణించారు. ఈ నెల 15న ఇస్తాంబుల్‌లో చర్చలకు రావాలని పుతిన్ ఆహ్వానించారు.

నేరుగా చర్చిద్దామన్న పుతిన్ ప్రతిపాదనను జెలెన్‌స్కీ సానుకూల పరిణామంగా అభివర్ణించారు. అయితే శాంతిచర్చలు జరిగే ముందు పూర్తిగా తాత్కాలిక కాల్పుల విరమణ జరగాలని అన్నారు. ఏ యుద్ధాన్ని అయినా నిజంగా ముగించడానికి మొదటి అడుగు కాల్పుల విరమణ. దీనికోసమే ప్రపంచమంతా ఎదురు చూస్తున్నది అని అన్నారు.
