అణ్వాయుధాల వినియోగంపై రూపొందించిన కొత్త విధానానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్. నూతన అణ్వాయుధ సిద్ధాంతాన్ని అమలు చేసేందుకు ఆయన ఫుల్ పవర్స్ ఇచ్చేశారు. తమ శత్రు దేశానికి మద్దతు ఇచ్చే దేశాల వద్ద సుదీర్ఘ దూరం ప్రయాణించే మిస్సైళ్లు ఉన్నప్పుడు, ఆ దేశంపై అణ్వాయుధంతో దాడి చేసేందుకు తాము కూడా సిద్ధంగా ఉంటామని ఇటీవల రష్యా ఓ కొత్త సిద్ధాంతాన్ని తయారు చేసింది. దాని ప్రకారం ఉక్రెయిన్‌కు సపోర్టు ఇచ్చే దేశాలపై కూడా అటాక్ చేసేందుకు వెనుకాడబోమని రష్యా ప్రకటనతో స్పష్టం చేసింది.