దేశంలో ఆర్థిక సంస్కరణలు ప్రవేశపెట్టింది తామేనని కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికీ గొప్పగా చెప్పుకుంటూ ఉంటుంది. అయితే, ఇందులో ఎంతమాత్రమూ నిజం లేదని ప్రముఖ రచయిత, ప్రోక్టర్ అండ్ గ్యాంబుల్ మాజీ సీఈవో గురుచరణ్దాస్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తన పుస్తకం ద డైలెమా ఆఫ్ యాన్ ఇండియన్ లిబరల్ లాంచింగ్ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, 1991లో దేశంలో ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చింది అప్పటి ప్రధానమంత్రి పీవీ నరసింహారావు, ఆర్థికశాఖమంత్రి మన్మోహన్సింగ్ తప్ప కాంగ్రెస్ కాదని స్పష్టం చేశారు.