భారత మాజీ ప్రధానమంత్రి పీవీ నరసింహారావుకు అత్యున్నత పురస్కారం భారతరత్న ఇవ్వాలని బీఆర్ఎస్ ఎన్నారై కో ఆర్డినేటర్ మహేష్ బిగాల డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా మహేష్ బిగాల మాట్లాడుతూ తెలంగాణలో అత్యంత వైభవంగా పీవీ శతజయంతి ఉత్సవాలను గత బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్వహించింద న్నారు. ఇప్పటికైనా రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ చొరవ తీసుకొని పీవీకి భారతరత్న ఇవ్వాలని కోరారు. పీవీకి భారతరత్న అంశాన్ని కేంద్రం దృష్టికి తీసుకువెళ్లాల్సిందిగా కోరారు.