స్నేహ చిత్ర పతాకంపై స్వీయ దర్శకత్వంలో ప్రముఖ నటుడు ఆర్. నారాయణ మూర్తి. రూపొందించిన చిత్రం యూనివర్సిటీ. ఈ నెల 26న ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ సందర్భంగా ప్రివ్యూ షోను ఏర్పాటు చేశారు. అనంతరం జరిగిన సమావేశంలో ఆర్.నారాయణ మూర్తి మాట్లాడుతూ విద్య, వైద్యాన్ని జాతీయం చేయాలనే అంశాన్ని ఈ సినిమాలో చర్చించాం. గొప్ప సామాజిక సందేశంతో ఈ సినిమా ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటుంది అన్నారు. మనది నిరుద్యోగ భారతం కాదు..ఉద్యోగ భారతం కావాలి అనే గొప్ప సందేశాన్ని ఈ సినిమాలో చాటి చెప్పాం.

ఇందులో ఐదు పాటలుంటాయి. ప్రేక్షకులు ఈ చిత్రాన్ని విజయవంతం చేయాలని కోరుకుంటున్నా అన్నారు. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మాజీ ఛైర్మన్ ఘంటా చక్రపాణి మాట్లాడుతూ ప్రజల్లో సామాజిక స్పృహను పెంపొందించే చిత్రమిది. సమాజంలో జరుగుతున్న యథార్థ సంఘటనల్ని ఈ సినిమాలో చూపించారు అని పేర్కొన్నారు. ప్రొఫెసర్ లక్ష్మీ నారాయణ మాట్లాడుతూ విద్య ప్రైవేటీకరణ తాలూకు దుష్ప్రభావాల్ని ఈ సినిమాలో చక్కగా ఆవిష్కరించారని తెలిపారు.

ఈ కార్యక్రమంలో తెలంగాణ ప్రెస్ అకాడమీ ఛైర్మెన్ అల్లం నారాయణ, శ్రీనివాస్ , తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మాజీ చైర్మన్ ఘంటా చక్రపాణి, ప్రొఫెసర్ లక్ష్మీ నారాయణ, ప్రొఫెసర్ కోయి కోటేశ్వరరావు , తెలుగు ఫిలిం జర్నలిస్ట్ అసోసియేషన్ అధ్యక్షులు లక్ష్మి నారాయణ వారణాసి, తెలుగు ఫిలిం జర్నలిస్ట్ అసోసియేషన్ జనరల్ సెక్రెటరీ వై జే రాంబాబు గారు పాల్గొన్నారు.















