Skip to main content

Namaste NRI

ఆర్.నారాయణమూర్తి యూనివర్సిటీ మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్

స్నేహ చిత్ర పతాకంపై స్వీయ దర్శకత్వంలో ప్రముఖ నటుడు ఆర్‌. నారాయణ మూర్తి. రూపొందించిన చిత్రం యూనివర్సిటీ. ఈ నెల 26న ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ సందర్భంగా ప్రివ్యూ షోను ఏర్పాటు చేశారు. అనంతరం జరిగిన సమావేశంలో ఆర్‌.నారాయణ మూర్తి మాట్లాడుతూ విద్య, వైద్యాన్ని జాతీయం చేయాలనే అంశాన్ని ఈ సినిమాలో చర్చించాం. గొప్ప సామాజిక సందేశంతో ఈ సినిమా ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటుంది అన్నారు. మనది నిరుద్యోగ భారతం కాదు..ఉద్యోగ భారతం కావాలి అనే గొప్ప సందేశాన్ని ఈ సినిమాలో చాటి చెప్పాం.

ఇందులో ఐదు పాటలుంటాయి. ప్రేక్షకులు ఈ చిత్రాన్ని విజయవంతం చేయాలని కోరుకుంటున్నా అన్నారు. తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ మాజీ ఛైర్మన్‌ ఘంటా చక్రపాణి మాట్లాడుతూ ప్రజల్లో సామాజిక స్పృహను పెంపొందించే చిత్రమిది. సమాజంలో జరుగుతున్న యథార్థ సంఘటనల్ని ఈ సినిమాలో చూపించారు  అని పేర్కొన్నారు. ప్రొఫెసర్‌ లక్ష్మీ నారాయణ మాట్లాడుతూ  విద్య ప్రైవేటీకరణ తాలూకు దుష్ప్రభావాల్ని ఈ సినిమాలో చక్కగా ఆవిష్కరించారని తెలిపారు.

 ఈ కార్యక్రమంలో తెలంగాణ ప్రెస్ అకాడమీ ఛైర్మెన్ అల్లం నారాయణ, శ్రీనివాస్ , తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మాజీ చైర్మన్ ఘంటా చక్రపాణి, ప్రొఫెసర్ లక్ష్మీ నారాయణ, ప్రొఫెసర్ కోయి కోటేశ్వరరావు , తెలుగు ఫిలిం జర్నలిస్ట్ అసోసియేషన్ అధ్యక్షులు లక్ష్మి నారాయణ వారణాసి, తెలుగు ఫిలిం జర్నలిస్ట్ అసోసియేషన్ జనరల్ సెక్రెటరీ వై జే రాంబాబు గారు పాల్గొన్నారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events